Random Video

వసతుల లేమితో అల్లాడుతున్న కస్తూరిబా విద్యార్థినులు || KGBV Students Facing Peculiar Problems In TS

2019-08-26 72 Dailymotion

The students of Kasturba Gandhi Balika Vidyalay are faced with a peculiar problem. Hygiene has gone for a toss here as several students dread to take bath and they have a reason to do so. After taking bath many of them complain of rash and itching and the cause for this is polluted water.
#KGBV
#KasturbaGandhiBalikaVidyalay
#Telangana
#rangareddy
#nagarkurnul
#students

రెండు వందల మంది విద్యార్థినులు ఉండేందుకు నిర్మించిన భవనంలో రెట్టింపు సంఖ్యలో ఉంటే.. పాఠశాల స్థాయి బాలికలకే సరిపోని వసతులు ఉన్న చోట విద్యార్థినులకు ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభిస్తే.. చదువు బుర్రకెక్కేది ఎట్లా? వాస్తవానికి పలు కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో(కేజీబీవీల్లో) ఇదే పరిస్థితి. డార్మిటరీ గదులనే తరగతి గదులుగా మార్చారు. ఒక తరగతి గదిలో రెండు తరగతులు నడుపుతున్నారు. బెంచీలు లేక విద్యార్థినులు కింద కూర్చుంటున్నారు. మిగిలిన అన్నం, చెత్తాచెదారం, పనికిరాని దుస్తులు, పిచ్చి మొక్కలతో ప్రాంగణ పరిసరాలు నిండిపోయి కనిపించాయి. రాష్ట్రంలోని వనపర్తి, నాగర్‌కర్నూల్‌ తదితర జిల్లాల్లోని కొన్ని కేజీబీవీలను ‘ఈనాడు’ పరిశీలించినప్పుడు ఈ దుస్థితులు కళ్ల ముందు సాక్షాత్కరించాయి. విద్యుత్తు, డ్రెయినేజీ, నీటి కుళాయిలకు సంబంధించి చిన్న మరమ్మతులు వచ్చినా సరిచేసే యంత్రాంగం లేదు. అవి క్రమేపీ పెద్దవై కొత్త సమస్యలకు మూలంగా మారుతున్నాయి.